Salman Khan: బాలీవుడ్ లో మెగా మల్టీస్టారర్... షారూఖ్, సల్మాన్ లతో చిత్రం!

Sharook and Salman in A New Movie
  • నవంబర్ లో మొదలు కానున్న షూటింగ్
  • హీరోయిన్ గా దీపికా పదుకొనే
  • సల్మాన్ క్యారెక్టర్ పై వెలువడని అధికారిక ప్రకటన
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, వెండితెరపై మరోసారి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు కలిసి నటించనున్నారు. షారూఖ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రంలో సల్మాన్ కూడా ఉంటారని, ఈ విషయాన్ని షారూఖ్ స్వయంగా ప్రకటిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో జాన్ అబ్రహామ్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ ఉండగా, ఇప్పుడు మరో సూపర్ స్టార్, సల్మాన్ భాగం కావడంతో, ఇది మెగా మల్టీ స్టారర్ గా మారిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, 2018లో షారూఖ్ హీరోగా వచ్చిన 'జీరో'లో సల్మాన్ ఓ చిన్న కామిక్ రోల్ చేశారు. ఆపై వీరిద్దరూ కలిసి నటించలేదు. అంతకుముందు 'కుచ్ కుచ్ హోతాహై', 'ఓమ్ శాంతి ఓమ్', 'హర్ దిల్ జో ప్యార్ కరేగా' వంటి చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ కొత్త చిత్రం షూటింగ్ పనులు ఈ నెలలోనే మొదలవుతాయని, న్యూయార్క్ లో సైతం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం తరువాత తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ చిత్రాన్ని, రాజ్ కుమార్ హిరానీతో మరో చిత్రాన్ని షారూఖ్ ఇప్పటికే అంగీకరించారు.
Salman Khan
Sharook Khan
New Multistarer

More Telugu News