Donald Trump: ట్రంప్ ఎందుకు ఓడిపోతున్నారో చెప్పిన బీజేపీ చీఫ్ నడ్డా

Trump Couldnot Handle Covid Properly says BJP Chief
  • కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ విఫలమయ్యారు
  • బైడెన్ దీనినే ప్రచారాస్త్రంగా మలచుకున్నారు
  • మోదీ మాత్రం కరోనాపై విజయం సాధించారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుండగా, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఓటమికి చేరువలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ పరాజయం ఖాయమని దాదాపు అందరూ ఓ నిర్ణయానికి వచ్చేసిన వేళ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందించారు.

బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భాంగాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను సరిగ్గా ఎదుర్కోలేకపోవడం వల్లే ట్రంప్ ఓటమి పాలవుతున్నారని అన్నారు. అదే సమయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మాత్రం కరోనాపై విజయం సాధించారని, 130 కోట్ల మందిని రక్షించగలిగారని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనానే ప్రచారాస్త్రమైందన్నారు. ప్రత్యర్థి జో బైడెన్ కరోనా విషయంలో ట్రంప్‌పై విమర్శలు గుప్పించారని అన్నారు. ట్రంప్ కనుక ఓటమి పాలైతే దానికి కరోనానే కారణమవుతుందని నడ్డా పేర్కొన్నారు.
Donald Trump
america
Bihar
JP Nadda
Corona Virus

More Telugu News