Andhra Pradesh: ఏపీ పాఠశాలల్లో కరోనా విజృంభణ.. 575 మంది విద్యార్థులకు, 829 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్!

575 students in AP tested with corona
  • ఏపీలో మూడు రోజుల కింద ప్రారంభమైన పాఠశాలలు
  • పాఠశాలకు వెళ్లిన వారిలో కరోనా
  • రాష్ట్ర వ్యాప్తంగా 41,623 పాఠశాలల్లో కోవిడ్ పరీక్షలు
ఏపీలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే కరోనా భయాలతో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించలేదు. కానీ, పాఠశాలకు వెళ్లిన వారిలో పలువురు కరోనా బారిన పడుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 575 మంది విద్యార్థులు, 829 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలోని 41,623 పాఠశాలల్లో 70,790 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వీరిలో 829 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 95,763 మంది విద్యార్థులకు కూడా టెస్టులు నిర్వహించారు. పాజిటివిటీ రేటు విద్యార్థుల్లో 0.06 శాతంగా ఉండగా, ఉపాధ్యాయుల్లో 1.17 శాతంగా ఉంది.
Andhra Pradesh
COVID19
Corona Virus
Students

More Telugu News