Mahesh Babu: కోహ్లీకి మహేశ్, రకుల్ సహా పలువురి నుంచి ‘బర్త్ డే’ శుభాకాంక్షలు

mahesh wishes to kohli
  • నా అభిమాన క్రికెట‌ర్లలో కోహ్లీ ఒకరు
  • మరెన్నో రికార్డులు సృష్టించాలి
  • దేశం గ‌ర్వించేలా చేయాలి: మహేశ్
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాడు. ఆయనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ హీరో మహేశ్ బాబు కూడా కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఫేవరెట్ క్రికెటర్లలో ఆయన ఒకడని చెప్పాడు.

‘నా అభిమాన క్రికెట‌ర్లలో ఒక‌రైన విరాట్ కోహ్లీకి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు. నువ్వు మరెన్నో రికార్డులు సృష్టిస్తూ దేశం గ‌ర్వించేలా చేయాలి’ అని మహేశ్ పేర్కొన్నాడు. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ‘హ్యాపీ బర్త్ డే’ చెప్పింది.

ఇంకా కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రవిశాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ వంటి క్రికెటర్లు ట్వీట్లు చేశారు.
Mahesh Babu
Virat Kohli
Cricket

More Telugu News