Pawan Kalyan: నల్లకోటు వేసుకుని హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణించిన పవన్ కల్యాణ్.. ఫొటోలు వైరల్!

pawan journey on metro rail
  • మియాపూర్‌లో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ 
  • మాదాపూర్ నుంచి మియాపూర్‌కు మెట్రోలో పవన్ ప్రయాణం
  • సాధారణ ప్రయాణికుడిలా ఎక్కిన పవన్
  • తొలిసారి మెట్రో రైలు ఎక్కానని వ్యాఖ్య
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మియాపూర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సాధారణంగా కారులో వెళ్లే పవన్ కల్యాణ్ ఈ సారి మెట్రోలో సామాన్యులతో కలిసి ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపర్చారు. హైదరాబాద్ మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ఆయన మెట్రోలో ప్రయాణించారు.

 
   
ఆయన వెంట నిర్మాత దిల్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. సాధారణ ప్రయాణికుల్లానే చెకింగ్ ప్రక్రియతో పాటు ఎంట్రీ విధానాలను వారు పాటించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో పవన్ మాస్కు ధరించారు. మెట్రో ట్రైనులో ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చోవడంతో వారితో పవన్ మాట్లాడారు.          
ద్రాక్షారామానికి చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో పవన్ మాట్లాడారు. అయన పండిస్తోన్న పంటలు, ప్రస్తుతం ఎదురవుతోన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని రైతులు చెప్పారు.
     మెట్రో ప్రయాణం తనకు మొదటి సారని రైతు చెప్పారు. దీంతో పవన్ కల్యాణ్ నవ్వుతూ తనకు కూడా మెట్రో ప్రయాణం తొలిసారేనని అన్నారు. కాగా, పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మెట్రో రైలు జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ప్రాంతానికి రాగానే పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి సంబంధించిన బ్లడ్ బ్యాంక్ ఆఫీసుని కిటికీలోంచి చూశారు.
Pawan Kalyan
Janasena
Tollywood

More Telugu News