Andhra Pradesh: కర్నూలులో విచిత్రం: ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరమ్మాయిలు

two girls in kurnool fall in love and eloped
  • యువతులిద్దరూ చిన్ననాటి స్నేహితులు
  • స్నేహం ముదిరి ప్రేమగా మారినవైనం
  • తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి వెళ్లిపోయిన యువతులు
కర్నూలులో ఇద్దరు అమ్మాయిలు గాఢంగా ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి కథనం ప్రకారం.. పట్టణంలోని సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన యువతి (21), నర్సింహారెడ్డినగర్ నగర్‌కు చెందిన యువతి (20) చిన్నప్పటి నుంచి స్నేహితులు.  

వారి స్నేహం ఇటీవల మరింత ముదిరి ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. దీంతో ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు. వెళ్తూవెళ్తూ తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టారు. అది చూసి కంగారుపడిన ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతుల కోసం గాలిస్తున్నారు.
Andhra Pradesh
Kurnool
lovers
Girls

More Telugu News