Donald Trump: గతంలో ఏ అధ్యక్ష అభ్యర్థికీ రానన్ని పాప్యులర్ ఓట్లు... రికార్డు సృష్టించిన జో బైడెన్!

Record Votes for Joe Biden
  • 7.16 కోట్లకు పైగా ఓట్లు బైడెన్ కు
  • 2008 నాటి ఒబామా రికార్డు కనుమరుగు
  • ఘన విజయం దిశగా డెమొక్రాట్లు
అమెరికా చరిత్రలో ఏ అభ్యర్థికీ రానన్ని పాప్యులర్ ఓట్లను సంపాదించుకున్న డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం దిశగా సాగుతున్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బైడెన్ 7.16 కోట్లకు పైగా పాప్యులర్ ఓట్లను సంపాదించుకున్నారు. యూఎస్ హిస్టరీలో ఎవరూ ఇన్ని ఓట్లను పొందకపోవడం గమనార్హం. ఇప్పటివరకూ అత్యధిక పాప్యులర్ ఓట్ల రికార్డు ఒబామా పేరిట ఉండేది.

2008లో జరిగిన ఎన్నికల్లో ఒబామాకు అత్యధికంగా 6.94 కోట్ల ఓట్లు వచ్చాయి. ఈ రికార్డును తాజాగా బైడెన్ అధిగమించారు. ఇక, ఈ ఎన్నికల్లో ట్రంప్ కు ఇప్పటివరకూ 6.83 కోట్లకు పైగా పాప్యులర్ ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుతానికి బైడెన్ మ్యాజిక్ ఫిగర్ కు ఆరు ఎలక్టోరల్ సీట్ల దూరంలోనే ఉన్నప్పటికీ, మెజారిటీ సాధించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. మరో నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడికావాల్సి వుండగా, మూడింటిలో ట్రంప్, ఒకదానిలో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు.
Donald Trump
Biden
USA
elections

More Telugu News