రాణించిన ఆటపట్టు, హర్మన్‌ప్రీత్.. వెలాసిటీ విజయ లక్ష్యం 127 పరుగులు

  • మహిళల టీ20 చాలెంజ్‌లో తొలిపోరు
  • నిప్పులు చెరిగిన వెలాసిటీ బౌలర్లు
  • మూడు వికెట్లు పడగొట్టిన ఏక్తా బిష్త్
మహిళల టీ20 చాలెంజ్‌లో భాగంగా షార్జాలో వెలాసిటీతో జరుగుతున్న తొలి పోరులో సూపర్‌నోవాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌నోవాస్‌ను వెలాసిటీ బౌలర్లు కట్టడి చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ముఖ్యంగా ఏక్తా బిష్త్ బంతితో నిప్పులు చెరిగింది. 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది.

జహనారా ఆలం, లీ కాస్పెరెక్‌లు కూడా చక్కని బంతులు విసిరారు. ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సూపర్‌నోవాస్ జట్టులో ఓపెనర్ చమరి అటపట్టు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రాణించారు. 39 బంతులు ఆడిన చమరి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేయగా, 27 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ప్రీత్ ఫోర్, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసింది. ప్రియా పూనియా 11, శశికళ సిరివర్ధనే 18 పరుగులు చేశారు.


More Telugu News

Supernovas Velocity Womens T20 Challenge 2020