Tirumala: రేపటి నుంచి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి.. ప్రకటించిన టీటీడీ

Tiruma Srivari walk way opens from tomorrow
  • కరోనా వైరస్ కారణంగా మెట్ల మార్గం మూసివేత
  • దర్శనం టోకెన్లు ఉన్న వారికి మాత్రమే అనుమతి
  • నడకదారిలో గస్తీ కాయనున్న టీడీడీ విజిలెన్స్, ఫారెస్ట్ సిబ్బంది
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. రేపటి (గురువారం) నుంచి మెట్ల మార్గంలో భక్తులను అనుమతించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే, ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శనం టోకెన్లు ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్, అటవీ సిబ్బంది నడకదారిలో ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో తిరుమలకు దారితీసే రెండు ఘాట్ రోడ్లు, మెట్ల మార్గాన్ని అప్పట్లో మూసివేశారు. ఆ తర్వాత మెట్ల మార్గం తెరుచుకోవడం ఇదే తొలిసారి.
Tirumala
Tirupati
Lord Venkateswara
walk way

More Telugu News