Andhra Pradesh: ఏపీ కరోనా అప్డేట్స్.. మరో 10 మంది మృతి

10 more in AP died with Coronavirus
  • 24 గంటల్లో కొత్తగా 2,477 మందికి కరోనా
  • 8,33,208కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
  • ప్రస్తుతం రాష్ట్రంలో 21,438 యాక్టివ్ కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 2,477 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 10 మంది కరోనా వల్ల చనిపోయారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,33,208కి చేరుకుంది. మొత్తం 6,744 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 2,701 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,438 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు అత్యధికంగా 1,17,207 కేసులు నమోదయ్యాయి.
Andhra Pradesh
Corona Virus

More Telugu News