Sanjay Raut: చట్ట ప్రకారమే అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేశారు: సంజయ్ రౌత్

Arnab Goswamy arrested as per law says Sanjay Raut
  • దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన అర్నాబ్ అరెస్ట్
  • అరెస్ట్  ను ఖండించిన ఎడిటర్స్ గిల్డ్
  • తప్పు చేసినట్టు ఆధారాలుంటే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉందన్న సంజయ్
రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనను ఎడిటర్స్ గిల్డ్, జర్నలిస్ట్ యూనియన్ ఖండించాయి. మరోవైపు ఈ అంశంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, చట్ట ప్రకారమే అర్నాబ్ ను అరెస్ట్ చేశారని చెప్పారు.

తప్పు చేసినట్టు ఆధారాలుంటే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందని అన్నారు. ఇంటీరియర్ డిజైనర్ ఎండీ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే కేసులో అర్నాబ్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.  
Sanjay Raut
Shiv Sena
Arnab Goswamy
Republic TV

More Telugu News