Niharika Konidela: ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక-చైతన్యల వివాహం

Niharika and Chaitanya get married at Udaypur
  • ఆగస్టులో నిహారిక, చైతన్యల వివాహ నిశ్చితార్థం
  • డిసెంబర్ 9 రాత్రి 7.15 నిమిషాలకు ముహూర్తం  
  • రాజస్థాన్, ఉదయ్ పూర్ లోని 'ఉదయ్ విలాస్' వేదిక  
ప్రముఖ నటుడు నాగబాబు కూతురు నిహారిక వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహ నిశ్చితార్థం ఆగష్టు నెలలో హైదరాబాదులో జరిగిన విషయం విదితమే. ఇప్పుడు వీరి వివాహం డిసెంబర్ 9న జరగనుంది. ఈ విషయాన్ని వరుడి తండ్రి ప్రభాకరరావు మీడియాకు తెలిపారు.

ఈ రోజు ప్రభాకరరావు దంపతులు తిరుమలకు విచ్చేసి, పెళ్లిశుభలేఖను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ప్రభాకరరావు వివాహానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారని తెలిపారు. అలాగే వివాహాన్ని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్ లో నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
Niharika Konidela
Chaitanya Jonnalagadda
Nagababu

More Telugu News