ఇండియాకు పెట్టుబడులే లక్ష్యంగా... మోదీ కీలక సమావేశం!
- 20కి పైగా కంపెనీలతో సమావేశం
- పెట్టుబడి అవకాశాలను వివరించనున్న మోదీ
- పలు కంపెనీలతో విడివిడిగానూ సమావేశం
ఇక ఈ సమావేశానికి ఆస్ట్రేలియన్ సూపర్ అండ్ ఫ్యూచర్ ఫండ్, జపాన్ కు చెందిన పోస్ట్ బ్యాంక్ మరియు ఓంటారియో పెన్షన్ తదితర దిగ్గజ ఫండ్ కంపెనీలు హాజరు కానున్నాయి. కీలకమైన ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ ఇన్వెస్టర్లను భాగం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగనుంది. కాగా, నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ పైప్ లైన్ లో భాగంగా, 7 వేల ప్రాజెక్టులను ఇప్పటికే గుర్తించామని, వాటిని గురించి మోదీ ప్రస్తావించనున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.