Donald Trump: ఎన్నికల ఫలితాలపై ట్రంప్ తాజా వ్యాఖ్యలు!

Trump Latest Comments on Elections
  • గెలుస్తానన్న నమ్మకం ఉంది
  • అన్ని ప్రాంతాల్లోనూ ముందంజలో ఉన్నాం
  • ప్రజలకు కృతజ్ఞతలని ట్వీట్
ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం తనకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ముందంజలో ఉన్నాము. కృతజ్ఞతలు" అని ట్వీట్ పెట్టారు. అంతకుముందు, "ఓటేసేందుకు మరికొంత సమయం ఉంది. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో చూసుకుని వెళ్లి, అమెరికాను గొప్పగా మార్చే డొనాల్డ్ ట్రంప్ కు ఓటేయండి" అని అన్నారు.  కాగా, అధ్యక్ష ఎన్నికల తరువాత వివిధ ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ట్రంప్, బైడెన్ లు నువ్వా? నేనా?అన్నట్టుగా పోటీ పడుతున్నారు.
Donald Trump
Elections
Twitter

More Telugu News