Amala Paul: మాజీ ప్రియుడు భవీందర్ పై కోర్టుకెక్కిన నటి అమలాపాల్!

Court Granted Permission to Amalapaul to Proceed a Case on Lover
  • ఓ వ్యాపార ప్రకటన కోసం తీసుకున్న ఫొటోలు 
  • తప్పుడు క్యాప్షన్ తో బయటకు వదిలారు
  • భవీందర్ పై కేసుకు కోర్టు అనుమతి
ఓ వ్యాపార ప్రకటన కోసం తీసుకున్న ఫొటోలకు తప్పుడు శీర్షిక పెట్టి, తన మాజీ ప్రియుడు భవీందర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా పరువు తీశారని ఆరోపిస్తూ, నటి అమలాపాల్ కోర్టును ఆశ్రయించింది. అమలాపాల్ దాఖలు చేసిన పిటిషన్ గురించిన వివరాలు విన్న న్యాయమూర్తి, భవీందర్ సింగ్ పై కేసు వేసేందుకు అనుమతించడం గమనార్హం.

కాగా, ఆ మధ్య అమలాపాల్ కు, భవీందర్ కు పెళ్లి జరిగిందని కూడా కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అయ్యాయి. అయితే, అటువంటిదేమీ లేదని ఆమె వివరణ ఇచ్చింది. అంతకుముందు డైరెక్టర్ ఎల్.విజయ్ ని వివాహం చేసుకుని, అనంతరం, అతని నుంచి విడిపోయిన తరువాత ముంబైకి చెందిన గాయకుడు భవీందర్ తో లవ్ తో పడి, ఆపై బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే.
Amala Paul
Bhavinder Singh
Court Case

More Telugu News