Ragini Dwivedi: రాగిణి ద్వివేది, సంజన బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన న్యాయస్థానం

Karnataka high court denies bail to Ragini Dwivedi and Sanjana Galrani
  • డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ భామలు
  • తాజాగా కర్ణాటక హైకోర్టులో చుక్కెదురు
  • అనేక పర్యాయాలు బెయిల్ కోసం యత్నించిన రాగిణి, సంజన
కన్నడ చిత్రసీమలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ తారలు రాగిణి ద్వివేది, సంజన గల్రానీలను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఈ ఇద్దరు భామలకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాగిణి, సంజనల బెయిల్ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో రాగిణి సెప్టెంబరు 4న అరెస్ట్ కాగా, సంజన సెప్టెంబరు 8న అరెస్ట్ అయింది. అప్పటి నుంచి పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా, అన్ని పర్యాయాలు నిరాశే మిగిలింది. అనేక పార్టీల్లో వీరిద్దరూ డ్రగ్స్ తీసుకోవడమే కాక, డ్రగ్స్ కలిగి ఉన్నారని అభియోగాలు కూడా నమోదయ్యాయి. రాగిణి, సంజన ప్రస్తుతం బెంగళూరు పరప్పన జైలులో ఉన్నారు. ఇటీవలే సంజన తన పుట్టినరోజును కూడా జైల్లోనే జరుపుకుంది.
Ragini Dwivedi
Sanjana Galrani
Bail
High Court
Karnataka
Drugs Case

More Telugu News