Viral Videos: ‘ఆంటీ..’ అని పిలిచినందుకు అందరిముందూ అమ్మాయిని చితకబాదిన మహిళ.. వీడియో వైరల్

Angry woman grabbed and beaten a girl
  • ఉత్తరప్రదేశ్‌లోని ఎటాలో కరవాచౌత్‌లో ఘటన
  • పూజా సామగ్రి దుకాణం వద్ద రచ్చ
  • విడిపించిన స్థానికులు
‘ఆంటీ’ అని పిలిచినందుకు అందరి ముందూ ఓ అమ్మాయిని ఓ మహిళ చితగ్గొట్టింది. దీంతో అక్కడి వారంతా కలిసి ఆ అమ్మాయిని కాపాడి విడిపించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటాలో కరవాచౌత్‌లో ఓ పూజా సామగ్రి దుకాణం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్ ఫోన్లలో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

ఎటాలోని బాబూగంజ్ మార్కెట్‌లో పూజ సామగ్రి అమ్ముతారు. వాటిని కొనుగోలు చేయడానికి పలువురు మహిళలు వచ్చిన నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక యువతి వారిలో ఒకరిని ‘ఆంటీ..’ అని పిలవడంతో ఈ గొడవ చెలరేగింది. ‘నన్ను ఆంటీ అని పిలుస్తావా?’ అంటూ  యువతిని జుట్టు పట్టుకుని కొట్టింది ఆ మహిళ. ఆమెతో వున్న మరికొందరు కూడ ఆ అమ్మాయిని తలో చెయ్యి వేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తాను సదరు మహిళను ‘ఆంటీ..’ అని పిలవడంతోనే ఆమె తనను కొట్టిందని యువతి పోలీసులకు చెప్పింది.
Viral Videos
Uttar Pradesh

More Telugu News