Poorna: బాలకృష్ణ సినిమాకు మరో కథానాయిక ఎంపిక!

Another heroine also finalized for Balakrishnas movie
  • బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడో చిత్రం 
  • ఇటీవలే మొదలైన తాజా షెడ్యూలు షూటింగ్
  • ఒక కథానాయికగా ప్రయాగ మార్టిన్
  • మరో నాయికగా పూర్ణ ఎంపిక  
బాలకృష్ణ, బోయపాటి కాంబోకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరి కలయికలో గతంలో వచ్చిన 'సింహా', 'లెజండ్' సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఆ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న మూడో చిత్రం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

ఏడు నెలల లాక్ డౌన్ గ్యాప్ తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. హీరో బాలకృష్ణ కూడా షూటింగులో పాల్గొంటున్నారు. ఇక ఇందులో ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. వీరిలో ఒకరిగా ఇప్పటికే మలయాళ భామ ప్రయాగ మార్టిన్ ను ఎంపిక చేశారు. తాజాగా మరో హీరోయిన్ పాత్రకు పూర్ణను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న కోణాల్లో కనిపిస్తారని అంటున్నారు. వీటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం విశేషం. మరోపాత్రలో పంచె కడతారని వార్తలొస్తున్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.
Poorna
Balakrishna
Boyapati Sreenu
Prayaga Martin

More Telugu News