Chirag Paswan: నితీశ్ కుమార్ మళ్లీ సీఎం గానా?.. నెవ్వర్: చిరాగ్ పాశ్వాన్

Nitish will never become CM again after November 10
  • కావాలంటే రాసిస్తా
  • ‘బీహార్ ఫస్ట్’ కావాలన్నదే నా లక్ష్యం
  • అహంకారంతో విర్రవీగే నాయకులను ప్రజలను ఉపేక్షించరు
బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తేల్చి చెప్పారు. అహంకారంతో విర్రవీగే నాయకులను ప్రజలు అధికారం నుంచి తొలగిస్తారని అన్నారు. ఈ నెల 10 తర్వాత నితీశ్ మళ్లీ సీఎం అయ్యే అవకాశమే లేదని, కావాలంటే తాను ఈ విషయాన్ని రాతపూర్వకంగా చెబుతానని పేర్కొన్నారు.

నితీశ్ కుమార్‌కు బీహార్ అభివృద్ధిపై ఎటువంటి రోడ్‌మ్యాప్ లేదన్న చిరాగ్.. ‘బీహార్ ఫస్ట్, బీహార్ ఫస్ట్’ అన్నదే తన లక్ష్యమని అన్నారు. మరోవైపు, మహాఘట్ బంధన్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వీ యాదవ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, విద్య, వైద్యం, ద్రవ్యోల్బణం తదితర ఎజెండా ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు.
Chirag Paswan
Nitish Kumar
Bihar
Tejashwi Yadav

More Telugu News