KTR: అతని ఒంటిపై మా రూపాల టాటూలు చూసి కొంచెం బాధపడ్డాను: కేటీఆర్

KTR feels amazing after a worker tattooed on body
  • సీఎం కేసీఆర్, కేటీఆర్ ల పచ్చబొట్లు వేయించుకున్న కార్యకర్త
  • ముగ్ధుడ్నయ్యానన్న కేటీఆర్
  • నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యలు
రామాంజనేయులు అనే టీఆర్ఎస్ కార్యకర్త తన శరీరంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల బొమ్మలను పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన కేటీఆర్ ఆ యువకుడ్ని పిలిపించి అతని ఒంటిపై ఉన్న టాటూలను చూసి విస్మయానికి గురయ్యారు. రామాంజనేయులు తమ బొమ్మలను టాటూ వేయించుకోవడం అబ్బురపరిచిందని తెలిపారు. తమపై అతడి వీరాభిమానం హృదయాన్ని తాకిందని పేర్కొన్నారు.

అతడి ప్రేమ తనను ముగ్ధుడ్ని చేసినా, కొంచెం బాధగా అనిపించిందని వివరించారు. పార్టీకి చెందిన ఓ వీరాభిమానిని ఈ విధంగా చూడడం నమ్మశక్యంగా అనిపించలేదని, ఇకపైనా మరింత మెరుగ్గా పనిచేయాలన్న ఉత్సాహం కలుగుతోందని తెలిపారు.

ఈ అంశంపై టీఆర్ఎస్ మీడియా విభాగం కన్వీనర్ సతీశ్ రెడ్డి స్పందిస్తూ.... పచ్చబొట్టు వేయించుకున్న కార్యకర్తను కేటీఆర్ అభినందించినా, ఆపై సున్నితంగా మందలించారని, ఇలాంటి వాటికంటే ప్రజలకు మేలు చేయడంపై దృష్టి సారించాలని హితవు పలికారని వెల్లడించారు.
KTR
Ramanjaneyulu
Tattoo
TRS
KCR
Telangana

More Telugu News