pooja: అప్పుడు ఎంతో నిరాశకు గురయ్యాను: పూజ హెగ్డే

Felt unhappy with first Bollywood failure says Pooja Hegde
  • నా తొలి బాలీవుడ్ సినిమా ఫ్లాప్ కావడంతో నిరాశ చెందాను
  • అందుకే రెండో సినిమాకు గ్యాప్ తీసుకున్నా
  • దక్షిణాదిలో విజయవంతం కావడం ధైర్యాన్ని ఇచ్చింది
ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డే టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అగ్ర నటులందరితో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీగా ఉంటోంది. బాలీవుడ్ లో సైతం తనకంటూ గుర్తింపును సాధించుకుంది. తాజాగా బాలీవుడ్ లో తన కెరీర్ పై పూజ మాట్లాడుతూ, తన తొలి సినిమా 'మొహంజొదారో' పరాజయం పాలవడం తనను ఎంతో నిరాశకు గురి చేసిందని తెలిపారు.

తొలి చిత్రం ఎవరికైనా చాలా ముఖ్యమని... అలాంటప్పుడు తొలి చిత్రం ఫ్లాప్ అయితే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని చెప్పింది. అయితే, దక్షిణాదిలో విజయవంతం కావడంతో ధైర్యంగా ముందుకు సాగానని తెలిపింది. బాలీవుడ్ లో తొలి సినిమా ఫెయిల్ కావడంతో, రెండో సినిమాను ఒప్పుకోవడానికి గ్యాప్ తీసుకున్నానని చెప్పింది. అయితే తాజాగా 'హౌస్ ఫుల్ 4' సినిమా హిట్ కావడంతో ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ పై దృష్టి సారించానని తెలిపింది.
pooja
toll
Bollywood

More Telugu News