Nara Lokesh: లేని చట్టాల పేర్లు చెబుతూ ఇంకెంత కాలం మహిళల్ని మోసం చేస్తారు?: నారా లోకేశ్

 Nara Lokesh questions CM Jagan over crime incidents in state
  • పబ్లిసిటీ పిచ్చి తప్ప మీకేమీ పట్టదా అంటూ మండిపాటు
  • ఇంకెంతమంది బలైపోవాలంటూ ప్రశ్నించిన లోకేశ్
  • గాలి మాటలు చెప్పడం ఆపాలంటూ హితవు
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. లేని చట్టాల పేర్లు చెబుతూ ఎంతకాలం మహిళలల్ని మోసం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ పిచ్చి తప్ప మీకు మహిళల రక్షణ పట్టదా? అని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్య ధోరణికి ఇంకెంతమంది బలైపోవాలి? అని నిలదీశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని లోకేశ్ విమర్శించారు.

ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజుకు మూడు అత్యాచారాలు జరుగుతున్నాయని, మృగాళ్లు రెచ్చిపోయి చిన్నారులను చిదిమేస్తున్నారని వెల్లడించారు. విశాఖలో బంగారు భవిష్యత్తు ఉన్న వరలక్ష్మిని మృగాడు బలిదీసుకున్నాడని, ఈ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగకముందే చిత్తూరు జిల్లా రాయల్ పేటలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిందని లోకేశ్ మండిపడ్డారు. 'గాలి మాటలు చెప్పడం ఆపి మహిళలకు రక్షణ కల్పించండి జగన్ రెడ్డి గారూ' అంటూ హితవు పలికారు.
Nara Lokesh
Jagan
Women
Crime
Andhra Pradesh

More Telugu News