Varla Ramaiah: ముఖ్యమంత్రి గారూ... దీనిపై ప్రకటన చేయగలరా?: వర్ల రామయ్య

Varla Questions CM Jagan on Twitter
  • ఆందోళనలను అణచి వేయడంలో ఉక్కుపాదం
  • అసాంఘిక శక్తులపై సీఐడీ విచారణ జరిపించగలరా?
  • ట్విట్టర్ లో వర్ల రామయ్య
ఆందోళనలను అణచివేయడంలో ఉక్కుపాదం మోపుతున్న ఏపీ సర్కారు ఇతర అసాంఘిక శక్తులకు అనుకూలంగా నడుస్తున్న పాలనపై సీఐడీ విచారణ జరిపించగలరా? అని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు.

"ముఖ్యమంత్రి గారూ! దళితుల, రైతుల, మహిళల ఆందోళనలపై ఉక్కు పాదం మోపుతున్న మీ ప్రభుత్వం, అవినీతి పరులకు, భూ కబ్జాదారులకు, ఇసుక మాఫియాకు, ఎర్ర చందనం స్మగ్లర్లకు, ఇతర అసాంఘిక శక్తులకు అనుకూలంగా నడుస్తున్న విధానంపై సిఐడి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోగలరా? దీనిపై ప్రకటన చేయగలరా?" అని ప్రశ్నించారు.
Varla Ramaiah
Telugudesam
Jagan
Twitter

More Telugu News