Kajal Agarwal: 20 మంది 30 రోజుల శ్రమ... కాజల్ పెళ్లి డ్రెస్ వెనకున్న రియల్ స్టోరీ!

Kajal Marriage Dress 20 Members Crafted 30 days
  • గత వారాంతంలో కాజల్ వివాహం
  • గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్
  • గులాబీ రంగు లెహంగా ధరించిన అప్సరస
గత వారాంతంలో దక్షిణాది హీరోయిన్ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూను పెళ్లాడి, మిస్సెస్ కిచ్లూగా మారిపోయిందన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో ఆమె గులాబీ రంగు లెహెంగాను ధరించి, అప్సరసలా కనిపించింది. దీని డిజైనింగ్ రహస్యాన్ని డిజైనర్ అనామికా ఖన్నా, తన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపింది.

నిష్ణాతులైన 20 మంది కార్మికులు, నెల రోజులు పాటు శ్రమించి దీన్ని తయారు చేశారని ఆమె తెలిపింది.   ఫ్లోరల్ డిజైన్ ఎంబ్రాయిడరీలో దీన్ని తయారు చేశామని వెల్లడించింది. ఆమె ధరించిన ఆభరణాలను సునీతా షెకావత్ చేతితో తయారు చేశారని పేర్కొంది. కాజల్ పై తనకెంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని, అందుకే తాము డ్రెస్ కోసం ఇంతగా శ్రమించామని వెల్లడించింది. 
Kajal Agarwal
Gautam Kichlu
Marriage
Lehenga
Derss

More Telugu News