Beggar: దివ్యాంగురాలిగా నటిస్తూ భిక్షాటన.. అరెస్ట్ చేసిన పోలీసులకు బిగ్ షాక్!

Police Arrest 57 YearOld Woman Beggar Who Is Filthy Rich
  • ఆమెకు ఐదు నివాస భవనాలు
  • బ్యాంకు ఖాతాల్లో రూ. 1.42 కోట్లు
  • ఈజిప్టులో ఘటన
ఓ మహిళ దివ్యాంగురాలిగా నటిస్తూ భిక్షాటన చేస్తోందన్న ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. ఈజిప్టులో జరిగిందీ ఘటన. స్థానిక మీడియా కథనం ప్రకారం.. నఫీసా అనే 57 ఏళ్ల వృద్ధురాలు దివ్యాంగురాలిగా నటిస్తూ వీల్‌చైర్‌లో కూర్చుని భిక్షాటన చేస్తోంది.

సాయంత్రం భిక్షాటన ముగిసిన తర్వాత ఎవరూ లేనప్పుడు వీల్‌చైర్‌ను పక్కన పెట్టేసి, ఎంచక్కా నడుచుకుంటూ వెళ్లిపోతోంది. దీనిని గమనించిన కొందరు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఆమెను అరెస్ట్ చేశారు. పక్షవాతం కారణంగా తాను ఓ కాలును కోల్పోయినట్టు ఆమె చెప్పింది. అయితే, అది వాస్తవం కాదని విచారణలో తేలింది.

దీంతో ఆ మహిళ గురించి ఆరా తీయగా షాకయ్యే విషయాలు వెలుగుచూశాయి. గర్బియా, ఖలిబుయా గవర్నరేట్స్ ప్రాంతాల్లో ఆమెకు పలు ప్రాంతాల్లో ఐదు నివాస భవనాలు ఉన్నాయని, ఆమె రెండు బ్యాంకు ఖాతాల్లో మూడు మిలియన్ ఈజిప్షియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 1.42 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నోరెళ్లబెట్టారు. దీంతో పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేపట్టారు.
Beggar
Egypt
wheelchair
Filthy Rich
Police

More Telugu News