marriage: పెళ్లి పీటలపై పెళ్లి కొడుకు తాళికట్టబోతుండగా వద్దని చెప్పిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్

girl refuses groom
  • తన ప్రియుడు కాసేపట్లో వస్తాడన్న పెళ్లి కూతురు
  • పెళ్లి పీటల నుంచి వెళ్లిపోయిన వరుడు
  • ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన కుటుంబ సభ్యులు
పెళ్లి కొడుకుకి పెళ్లి పీటల మీదే.. అదీ తాళి కట్టే సమయంలో షాకిచ్చింది ఓ వధువు. పెళ్లి కొడుకు తాళికట్టబోతుండగా అడ్డుకుంది. తన ప్రియుడు అరగంటలో వస్తాడని చెప్పింది. తమిళనాడులోని  నీలగిరి జిల్లాలోని మట్టకండి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందరి ముందూ ఆమె చేసిన పనికి పెళ్లి కొడుకుతో సహా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

వివాహ వేడుక నుంచి వరుడే కాకుండా అక్కడున్న వారంతా వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  కరోనా నేపథ్యంలో కొద్దిమంది బంధువుల సమక్షంలో  వారిద్దరి పెళ్లి అక్టోబర్‌ 29న జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చివరి నిమిషంలో వధువు చేసిన పని ఆమె కుటుంబ సభ్యులకు మొదట ఆగ్రహం తెప్పించింది. అయితే, చివరకు అదే పెళ్లి మండపంలో వధువును ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేశారు.


marriage
Viral Videos
Tamilnadu

More Telugu News