Bigg Boss: బిగ్ బాస్ లో అనూహ్యం... శనివారమే నోయల్ ను పంపించేసిన నాగార్జున!

Noel Out from Biggboss
  • బాగా ఆడుతున్నాడని పేరు తెచ్చుకున్న నోయల్
  • అనారోగ్య కారణాలతో హౌస్ నుంచి బయటకు
  • అవినాష్, మాస్టర్ లపై ఆగ్రహం
టాలీవుడ్ అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లో ఆది నుంచి ఎంతో బాగా ఆడుతున్నాడని పేరు తెచ్చుకున్న నోయల్, అనూహ్యంగా హౌస్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. పలు అనారోగ్య కారణాలతో నోయల్ ను హౌస్ నుంచి పంపించి వేస్తున్నట్టు నాగార్జున ప్రకటించాడు. ఉన్నన్ని రోజులూ ఎంతో బాగున్న నోయల్, బయటకు వచ్చిన తరువాత మాత్రం మారిపోయినట్టుగా కనిపించడంతో పాటు, తన మనసులోని మాటలను బయటకు వదిలాడు. కొందరి గురించి మంచిగా, మరికొందరి గురించి చెడుగా కాకపోయినా, విమర్శలను గుప్పించాడు.

ఇక ఇటీవల కొన్ని వారాలుగా, ఎలిమినేషన్స్ సక్రమంగా జరగడం లేదని వస్తున్న విమర్శలపై హోస్ట్ నాగార్జున స్పందించారు. ప్రేక్షకులు వేస్తున్న ఓట్లను బట్టి మాత్రమే హౌస్ నుంచి బయటకు ఎవరు వెళతారన్న విషయం ఉంటుందని తెలిపారు. ఇక, షూటింగ్ నిమిత్తం కులూమనాలికి వెళ్లిన నాగ్, అక్కడి నుంచి హౌస్ లో ఉన్న వారికి కొత్త బట్టలు తెచ్చారు.

ఇక చివరకు నోయల్ కోరిక మేరకు అతన్ని హౌస్ నుంచి బయటకు పిలిచిన తరువాత, నోయల్ తన మనసులో నెలకొన్న బాధను బయటపెట్టాడు. తనకు 'ఆంక్లియో స్పాండిలైటిస్' వ్యాధి ఉందని, పొద్దున్నే లేచిన తరువాత కనీసం అరగంట పాటు కాళ్లను స్ట్రెచ్ చేసుకుంటేనే నడుస్తానని, కానీ, మాస్టర్, అవినాష్ లు తన కాళ్లను టార్గెట్ చేసుకున్నారని వాపోయారు. వారు ఇద్దరూ తన కాలితో ఆడుకున్నారని వాపోయాడు. అవినాష్ చిల్లర కామెడీలు చేశాడని అనగానే, నోయల్ మాటలను టీవీలో చూస్తున్న అవినాష్ కు కోపం వచ్చింది. నోయల్ కావాలనే బయటకు వెళ్లిన తరువాత తమను బ్లేమ్ చేస్తున్నాడని చెప్పడంతో, ఓ వైపు మాస్టర్, అవినాష్, మరోవైపు నోయల్ కు పెద్ద గొడవే జరిగింది. గొడవ పెద్దది కాకుండా నాగ్ మధ్యలో అడ్డుకుని, సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.

Bigg Boss
Bigg Boss Telugu 4
Noyel
Nagarjuna

More Telugu News