KCR: కొడకండ్ల నుంచి వస్తూ... వాసాలమర్రి వాసులను ఆగి మరీ పలకరించిన కేసీఆర్!

KCR Stopped his Convoy Near Vasalamarri
  • నిన్న కొడకండ్లలో పర్యటించిన కేసీఆర్
  • తిరుగు ప్రయాణంలో వాసాలమర్రి దగ్గర ఆగిన సీఎం
  • కలిసిన ప్రజలతో మాటామంతి
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, నిన్న కొడకండ్ల గ్రామంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైన ఆయన మార్గమధ్యంలో తన కాన్వాయ్ కోసం ఎదురుచూస్తున్న వాసాలమర్రి వాసులను పలకరించారు.రోడ్డు వెంబడి నిలబడి వున్న గ్రామీణులను చూసిన కేసీఆర్, తన కాన్వాయ్ ని ఆపించారు. ఆపై కారు దిగి, వారి వద్దకు వెళ్లి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా? అని తనకు తారసపడిన వారిని కేసీఆర్ ప్రశ్నించారు. 
KCR
Kodakandla
Canvoy

More Telugu News