మా పెళ్లిలో తెలుగు సంప్రదాయాన్ని కూడా పాటించాం: కాజల్ అగర్వాల్
- గౌతమ్ కిచ్లూతో కాజల్ పెళ్లి
- ముంబయిలో ఘనంగా వివాహం
- జీలకర్ర-బెల్లంపై వివరణ ఇచ్చిన కాజల్
"ఓ పంజాబీ వచ్చి ఓ కశ్మీరీని వివాహం చేసుకుంది. అయితే గౌతమ్ కు, నాకు దక్షిణ భారతదేశంతో ఎంతో అనుబంధం ఉంది. తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో జీలకర్ర-బెల్లం చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ ప్రక్రియ ద్వారానే వధూవరులు ఒక్కటవుతారు. జీలకర్ర,బెల్లాన్ని ముద్దలా చేసి తమలపాకుపై ఉంచి ముహూర్త సమయానికి వేదమంత్రాల నడుమ ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటారు. ఆ తర్వాతే పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఒకరిని ఒకరు చూసుకుంటారు. కష్టసుఖాల్లోనూ కలిసి ఉంటారని చెప్పేందుకు ఈ తంతు" అంటూ కాజల్ తెలిపారు.