దుబ్బాకలో కాషాయ జెండా ఎగరడం ఖాయం... సీఎం తాత వచ్చినా బీజేపీ విజయం ఆగదు: బండి సంజయ్
- దుబ్బాకలో ఉప ఎన్నికల వేడి
- ఈ ఎన్నికలు తమకు ఒక లెక్కే కాదన్న సీఎం కేసీఆర్
- కేసీఆర్ అహంకారానికి ఓట్లతో సమాధానం చెప్పాలన్న సంజయ్
రోజురోజుకు దుబ్బాక నియోజకవర్గ ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని తెలిపారు. సర్వేలు మొత్తం తమకే అనుకూలంగా ఉన్నాయని సంజయ్ వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేస్తున్న రఘునందన్ రావుతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం అహంకారానికి ఓట్లతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఓ పాస్ పోర్టుల బ్రోకర్ అని, నిరుద్యోగులను ముంచి కోట్లు సంపాదించారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటేయాలని అన్నారు రఘునందన్ గెలిచాక అసెంబ్లీలో మొదటి చర్చ పెన్షన్లపైనే ఉంటుందని, ప్రతి ఇంటికి రెండు పెన్షన్లు ఎందుకివ్వరని ప్రశ్నించారు.