: హ్యారీపోటర్‌ 'నోట్సు'కు రేటెక్కువే!

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రచన హ్యారీపోటర్‌. కెజే రౌలింగ్‌ ఊహాజనితమైన ఈ రచన సినిమాలుగా విడుదలై అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ రచనకు సంబంధించి రచయిత రాసుకున్న నోట్సు కూడా అదేవిధంగా సంచలనాత్మకంగా అమ్ముడుబోయింది. ఈ నోట్సులో రౌలింగ్‌ తన రచనకు సంబంధించిన వ్యాఖ్యానాలు, స్వయంగా వేసుకున్న 22 బొమ్మలు, పుస్తకాన్ని ప్రచురించే సమయంలో తొలగించిన వాక్యాలు ఉన్నాయి.

సోత్‌ఈబే అనే సంస్థ కామన్‌ వెల్త్‌ దేశాలకు సంబంధించిన 50 మంది ప్రముఖ రచయితల వివరణాత్మక తొలి పుస్తకాలను వేలానికి పెట్టింది. ఈ వేలంలో హ్యారీపోటర్‌కు సంబంధించిన నోట్సుకోసం ఇద్దరు తీవ్రంగా పోటీ పడ్డారు. ఈ పోటీలో ఒకరు అత్యధికంగా 1,50,000 పౌండ్లకు ఈ పుస్తకాన్ని సొంతం చేసుకున్నారు.

More Telugu News