sector 50: ట్రాన్స్‌జెండర్లకు మెట్రోస్టేషన్ అంకితం.. సెక్టార్ 50 స్టేషన్ పేరు మార్చిన ఎన్‌ఎంఆర్‌సీ

sector 50 metro station dedicated to transgender community
  • స్టేషన్ పేరును ‘ప్రైడ్ స్టేషన్’గా మార్చిన ఎన్ఎంఆర్‌సీ
  • ఆరుగురు ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు
  • గతంలో 23 మందికి ఉద్యోగాలిచ్చిన కొచ్చి మెట్రో
ట్రాన్స్‌జెండర్ల గౌరవార్థం నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎన్ఎంఆర్‌సీ) సెక్టార్ 50 స్టేషన్ పేరును ‘ప్రైడ్ స్టేషన్’గా మార్చింది. ఫలితంగా ఉత్తర భారతదేశంలో ఓ స్టేషన్‌ను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ (లింగమార్పిడి సమాజం)కి అంకితమిచ్చిన తొలి మెట్రో రైలు సర్వీసుగా ఎన్ఎంఆర్‌సీ రికార్డులకెక్కింది. ఈ స్టేషన్‌ పేరును మార్చడమే కాకుండా ఆరుగురు ట్రాన్స్‌జెండర్లకు ఇక్కడ ఉద్యోగాలిచ్చింది. గతంలో కేరళలోని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ కూడా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది.

2017లో 23 ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలిచ్చింది. అప్పట్లో అదో సంచలనంగా మారింది. కాగా, తాజా నిర్ణయంపై ఎన్ఎంఆర్‌సీ మాట్లాడుతూ.. దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 4.9 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని, వారిలో 35 వేల మంది వరకు ఒక్క రాజధాని పరిధి (ఎన్‌సీఆర్)లోనే నివసిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం వీరి సంఖ్య మరింత పెరిగి ఉంటుందని పేర్కొంది. వారి కోసం ఓ స్టేషన్‌ను అంకితం చేయడం సంతోషంగా ఉందని తెలిపింది.
sector 50
NMRC
Transgender
pride station

More Telugu News