Keerti Suresh: 'వేదాళం' రీమేక్ లో చిరంజీవి సోదరిగా బిజీ స్టార్ ఎంపిక!

Artist finalized for Chiranjeevis sister role in Vedalam remake
  • 'ఆచార్య' తర్వాత వేదాళం రీమేక్ లో చిరంజీవి 
  • స్క్రిప్ట్ సిద్ధం చేసిన దర్శకుడు మెహర్ రమేశ్
  • సోదరి పాత్రకు సాయిపల్లవి, కీర్తి సురేశ్ పేర్ల పరిశీలన
  • చివరికి కీర్తి సురేశ్ కి దక్కిన అవకాశం  
ప్రస్తుతం చేస్తున్న 'ఆచార్య' తర్వాత చిరంజీవి రెండు రీమేక్ సినిమాలు చేయనున్నారు. వీటిలో ఒకటి తమిళంలో వచ్చిన హిట్ సినిమా 'వేదాళం' రీమేక్. దీనికి చిరంజీవి కజిన్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఇక ఈ చిత్రంలో హీరో సోదరి పాత్ర ఒకటి వుంది. ఇది చాలా కీలకమైన పాత్ర కావడంతో దీనికి హోమ్లీ ఇమేజ్ తో పాటు అభినయాన్ని ప్రదర్శించగలిగే కథానాయికను తీసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో సాయిపల్లవి, కీర్తి సురేశ్ లను పరిశీలించారు. చివరికి కీర్తి సురేశ్ వైపు చిరంజీవి మొగ్గు చూపించడంతో ఆమెను ఫైనల్ చేశారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె డేట్స్ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారట.

మరోపక్క, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో చిరంజీవి గుండుతో కనిపిస్తారని అంటున్నారు. అందుకే ఆమధ్య గుండు గెటప్ తో ట్రయిల్ ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో ఆయన వదిలారు.
Keerti Suresh
Chiranjeevi
Sai Pallavi
Mehar Ramesh

More Telugu News