Jagan: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాలు విడుదల

CM Jagan releases village and ward secretariat exam results
  • 19 కేటగిరీల్లో 16,208 ఉద్యోగాలకు పరీక్షలు
  • సెప్టెంబరులో పరీక్షల నిర్వహణ పూర్తి
  • నేడు ఫలితాలు విడుదల చేసిన సీఎం జగన్
ఇటీవల ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించారు. అనేక విభాగాల్లో ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు నేడు వెల్లడయ్యాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లోని మొత్తం 19 కేటగిరీల్లో 16,208 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ప్రకటించగా, 10,57,355 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 10 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 7,69,034 మంది హాజరయ్యారు.

టాపర్లు వీరే...
Jagan
Andhra Pradesh
Village Secretariat
Ward Secretariat
Results

More Telugu News