Supreme Court: టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపులపై సుప్రీంలో విచారణ... ఏపీ సర్కారుకు, టీడీపీకి నోటీసులు జారీ

Supreme Court issues notice to AP Government and TDP
  • సుప్రీంలో పిటిషన్ వేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
  • వాగు భూమి కబ్జాచేసి పార్టీ ఆఫీసు కట్టారని ఆరోపణ
  • పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
టీడీపీ ప్రధాన కార్యాలయానికి భూకేటాయింపుల విషయంలో సీఆర్డీయే నిబంధనల ఉల్లంఘన జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. 3.65 ఎకరాల వాగు భూమిని కబ్జా చేసి పార్టీ ఆఫీసు నిర్మాణం జరిపారని ఆరోపించారు. ఆర్కే దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఏపీ సర్కారుకు, తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. అప్పటివరకు విచారణ వాయిదా వేసింది.

ఎమ్మెల్యే ఆర్కే తరఫున ప్రశాంత్ భూషణ్, రమేశ్ వాదనలు వినిపించారు. జల వనరులతో సంబంధం ఉన్న భూమిని పార్టీ ఆఫీసుకు కేటాయించారని వారు కోర్టుకు తెలిపారు. జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో టీడీపీ జాతీయ కార్యాలయం ఉంది. ఇప్పటికే దీనిపై ఆర్కే రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో, న్యాయం జరగలేదని భావించి సుప్రీంను ఆశ్రయించారు.
Supreme Court
Andhra Pradesh
Government
YSRCP
Telugudesam
Alla Ramakrishna Reddy
AP High Court

More Telugu News