Hero Rajasekhar: హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల

Health Bulletin of Hero Rajasekhar
  • ఇటీవలే కరోనా బారినపడిన హీరో రాజశేఖర్
  • హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స
  • రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ ఇస్తున్నట్టు బులెటిన్ లో వెల్లడి
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవలే కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయనకు హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో కరోనా చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సిటీ న్యూరో సెంటర్ వర్గాలు హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశాయి. ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ రత్నకిశోర్ బులెటిన్ లో రాజశేఖర్ ఆరోగ్య వివరాలు తెలిపారు.

నటుడు రాజశేఖర్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు.  ప్రస్తుతం ఆయనకు చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ, సైటోసార్బ్ థెరపీ ఇస్తున్నామని వివరించారు. రాజశేఖర్ ను తమ వైద్యుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని డాక్టర్ రత్నకిశోర్ తాజా హెల్త్ బులెటిన్ లో తెలిపారు.
Hero Rajasekhar
Corona Virus
Health Bulletin
City Neuro Center
Hyderabad
Tollywood

More Telugu News