TDP: టీడీపీ నేతల గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ.. చిత్తూరు ఎస్పీకి చంద్రబాబు లేఖ

  • రామకుప్పం మండలంలో టీడీపీ మహాపాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
  • నేతలను ఎక్కడికక్కడ గృహ  నిర్బంధం చేసిన పోలీసులు
  • రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారని మండిపాటు
chandrababu writes letter to chittoor SP

హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేసి చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకురావాలని కోరుతూ రామకుప్పం మండలంలో నిన్న టీడీపీ నేతలు మహాపాద యాత్ర చేపట్టారు. అయితే, ఈ యాత్రలో పాల్గొనకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన టీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. టీడీపీ నేతలు శాంతియుత ఆందోళనల ద్వారా సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రభుత్వానికి ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం కంటే మరేదో ముఖ్యమైన అంశం ఉన్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా నిర్బంధించిన వారిని తక్షణం విడుదల చేయాలని ఎస్పీకి రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.

More Telugu News