తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

corona deaths in telangana reached to 1307
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 978 కేసులు మాత్రమే నమోదైనట్టు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా  ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,31,252కు పెరిగింది. అలాగే, నిన్న కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,307కు పెరిగింది.

మహమ్మారి బారి నుంచి నిన్న 1,446 మంది కోలుకోవడంతో ఈ మొత్తం సంఖ్య 2,10,480కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 19,465 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, వీరిలో 16,430 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న రాత్రి 8 గంటల నాటికి 185 కేసులు నమోదయ్యాయి.
             
Go Back to Shorts
Telangana
Corona Virus
corona deaths
GHMC

More Telugu News