Nara Lokesh: కూల్చివేతల జగన్ రాక్షస ఆనందానికి అడ్డూఅదుపు లేదు: నారా లోకేశ్

lokesh slams ap govt
  • కూల్చివేతల జగన్ రాక్షస ఆనందానికి అడ్డు అదుపు లేదు
  • జగన్ రెడ్డికి విధ్వంసం కిక్ ఇస్తుంది
  • సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత
  • ఇది రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ఠ 
విశాఖలోని గీతం  యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని కట్టడాలను అధికారులు కూల్చివేయడం పట్ల టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. పోలీసు బందోబస్తు మధ్య జేసీబీ, బుల్‌డోజర్లతో వాటిని కూల్చివేసిన ఘటనకు సంబంధించిన ఫొటోలను ఆయన పోస్టు చేశారు.

‘కూల్చివేతల వైఎస్ జగన్ రాక్షస ఆనందానికి అడ్డూఅదుపు లేదు. సీఎం స్థానంలో ఉన్న వారికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కిక్ వస్తుంది. జగన్ రెడ్డి కి విధ్వంసం కిక్ ఇస్తుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ఠ’ అని ఆయన విమర్శించారు.

‘కరోనా కష్ట కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సేవలు అందించింది గీతం ఆసుపత్రి. ఎన్నో ఏళ్లుగా విద్యాబుద్ధులు నేర్పి ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చిన గీతం యూనివర్సిటీ పై విధ్వంసం జగన్ రెడ్డి నీచ స్థితికి అద్దం పడుతోంది. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా యుద్ధవాతావరణం సృష్టించారు’ అని లోకేశ్ ట్వీట్లు చేశారు.

‘మొన్న సబ్బం హరి గారి ఇల్లు, నేడు గీతం యూనివర్సిటీ. పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్ రెడ్డి. విశాఖ లో విధ్వంసం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యడమే జగన్ రెడ్డి లక్ష్యం’ అని నారా లోకేశ్ ఆరోపించారు.
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News