Devineni Uma: వారికే ఎలా అనుమతి లభించిందో..?: దేవినేని ఉమ

Devineni Comments on Twitter over Amaravati Protests
  • అమరావతిలో రాజధానికి వ్యతిరేకంగా నిరసనలు
  • ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఎవరు అనుమతించారు?
  • జగన్ ను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన దేవినేని
అమరావతి ప్రాంతంలో అల్లర్లకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ, సెటైర్లు వేశారు. రాజధానికి వ్యతిరేకంగా అమరావతిలో నిరసనలు తెలియజేయడానికి కొందరికి అనుమతి ఎలా లభించిందని ప్రశ్నించారు.

"312రోజులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా జరుగుతున్న ప్రజా రాజధాని ఉద్యమాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం, ఉద్యమకారులను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 3 రాజధానులవారికి అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో పనేంటి? ప్రభుత్వం వారికి ఎలా ఎందుకు అనుమతిచ్చింది?" అని సీఎం జగన్ ను దేవినేని ప్రశ్నించారు.
Devineni Uma
Twitter
Jagan
Amaravati

More Telugu News