Appalaraju: అమరావతికి తానే పేరు తెచ్చినట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: ఏపీ మంత్రి అప్పలరాజు

Chandrababu damaged the name Amaravati says Appalaraju
  • అమరావతి పేరును చెడగొట్టారు
  • రాజకీయ ఎత్తుగడలకు అమరావతి కేంద్రంగా మారింది
  • పెయిడ్ ఆందోళనలను ఇంకెన్ని రోజులు నడిపిస్తారు?
అమరావతి పేరుకు తెలుగుదేశం పార్టీ మచ్చ తీసుకొచ్చిందని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. రాజధానికి అమరావతి అనే పేరును పెట్టి ఆ పేరును చెడగొట్టారని అన్నారు. అమరావతికి తానే పేరు తెచ్చినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రాజకీయ ఎత్తుగడలకు అమరావతి కేంద్రంగా మారిందని... పెయిడ్ ఆందోళనలను ఇంకా ఎన్ని రోజులు నడిపిస్తారో చూస్తామని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఉన్న ధ్యాన బుద్ధ విగ్రహంపై చంద్రబాబుకు పేటెంట్ లేదని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో కొనసాగుతున్న పెయిడ్ దీక్షలకు కమ్యూనిస్టులు కూడా మద్దతు తెలపడం దారుణమని అన్నారు.
Appalaraju
YSRCP
Chandrababu
Telugudesam
Amaravati

More Telugu News