వాహనదారులపై విధించిన భారీ జరిమానాలను రద్దు చేయాలి: అచ్చెన్నాయుడు
- వాహనదారులపై భారీ జరినామాలతో సరికొత్త విధానం
- వాహనదారులపై భారం వేశారన్న అచ్చెన్న
- రవాణా రంగాన్ని ఆదుకోవాలని వ్యాఖ్యలు
రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఈ 16 నెలల్లో కొత్తగా రోడ్డు వేయలేదు, ఉన్నవాటికి మరమ్మతులు చేయలేదని విమర్శించారు. వాహనదారులపై విధించిన భారీ జరిమానాలు వెంటనే రద్దు చేయాలని, సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.