Deekshit: కిడ్నాపైన కుమారుడి కోసం.... రూ.45 లక్షల నగదుతో రోడ్డుపై ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు!

Deekshit parents awaits for kidnappers in Mahboobabad
  • మూడ్రోజుల కిందట మహబూబాబాద్ లో బాలుడి కిడ్నాప్
  • ఇంటర్నెట్ కాల్స్ చేస్తున్న కిడ్నాపర్లు
  • కాల్ ట్రేసింగ్ చేయలేకపోతున్న పోలీసులు
  • రూ.45 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు
మహబూబాబాద్ లో దీక్షిత్ రెడ్డి (9) అనే బాలుడి కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. బాలుడ్ని వదిలేయాలంటే రూ.45 లక్షలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేయగా, వారు చెప్పినట్టే ఆ బాలుడి తల్లిదండ్రులు వసంత, రంజిత్ రూ.45 లక్షలతో కిడ్నాపర్లు చెప్పినచోటకు వచ్చారు. కానీ ఇంతవరకు కిడ్నాపర్లు బాలుడ్ని తీసుకురాకపోవడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. తమ కుమారుడు ప్రాణాలతో ఉంటే చాలని భావిస్తున్న ఆ తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠ అనుభవిస్తున్నారు.

కాగా, కిడ్నాపర్లు ఇంటర్నెట్ టెలిఫోన్ కాల్స్ చేస్తుండడంతో ఆ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించడం పోలీసులకు సవాల్ గా మారింది. మహబూబాబాద్ లో బాలుడ్ని కిడ్నాప్ చేసి ఇప్పటికి మూడ్రోజులు గడిచినా, ఎలాంటి క్లూ దొరకలేదు. కిడ్నాపర్లు 11 సార్లు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, తనకు తెలిసిన వ్యక్తులే తన బిడ్డను అపహరించి ఉంటారని బాలుడి తండ్రి  రంజిత్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. తెలిసిన వ్యక్తి కావడంతోనే దీక్షిత్ బైక్ పై ఎక్కి వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు.
Deekshit
Kidnap
Mahboobabad
Police

More Telugu News