Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

YCP leader RK Roja consoles Tamilnadu CM Palanisamy
  • అనారోగ్యంతో మృతి చెందిన సీఎం తల్లి తవసాయమ్మ
  • భర్త సెల్వమణితో కలిసి సీఎంకు పరామర్శ
  • పళని ఇంటికి పలువురు నేతలు
వైసీపీ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సీఎం తల్లి తవసాయమ్మ గతవారం కన్నుమూశారు. దీంతో ఆయనను పరామర్శించేందుకు భర్త ఆర్కే సెల్వమణితో కలిసి వెళ్లారు. సీఎం తల్లి చిత్రపటం వద్ద అంజలి ఘటించిన రోజా అనంతరం సీఎంతో కాసేపు మాట్లాడారు. కాగా, పలు పార్టీల నేతలు కూడా పళనిస్వామిని పరామర్శించారు. వీరిలో ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్, సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ, డీఎండీకే నేత సుదీప్, సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి తదితరులు ఉన్నారు.

.
Tamil Nadu
palanisamy
RK Roja
YSRCP

More Telugu News