Sake Sailajanath: రైతు వ్యతిరేక చట్టాలకు జగన్ మద్దతు పలికారు: శైలజానాథ్ విమర్శలు

Jagan is anti farmers says Sailajanath
  • వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం కలుగుతుంది
  • జగన్ రైతుల వ్యతిరేకి
  • వ్యవసాయ మీటర్లను కాంగ్రెస్ అడ్డుకుంటుంది
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల జీవితాలను నాశనం చేస్తాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఈ బిల్లులను దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, రైతులు ఉద్యమిస్తున్నారని అన్నారు. రైతులకు మద్దతుగా 2 కోట్ల సంతకాల సేకరణను చేపట్టామని చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ చట్టాలకు మద్దతు పలికిందని విమర్శించారు. పార్లమెంటులో ఈ బిల్లులకు అనుకూలంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై ఆయన మండిపడ్డారు. జగన్ రైతుల పక్షపాతి కాదని... రైతు వ్యతిరేకి అని అన్నారు. ప్రధాని మెప్పు కోసం జగన్ ఆరాటపడుతున్నారని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టే వ్యవసాయ మీటర్లను కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పారు.
Sake Sailajanath
Congress
Jagan
YSRCP
Narendra Modi
BJP
Farm Acts

More Telugu News