Vijayawada: విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ పెచ్చులూడి కానిస్టేబుల్ కు గాయాలు!

Conistable Injured Under Kanakadurga Fly Over in Vijayawada
  • ఇటీవల జాతికి అంకితమైన పై వంతెన
  • డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై పడ్డ పెచ్చులు
  • గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు
బెజవాడకు మణిహారంలా, దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రికి కంఠహారంలా ఇటీవల జాతికి అంకితమైన కనకదుర్గ ఫ్లై ఓవర్ నుంచి పెచ్చులూడి పడుతున్నాయి. నిన్న వంతెన కింద దసరా ఉత్సవాల్లో భాగంగా డ్యూటీ చేస్తున్న ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై ఈ పెచ్చులు పడటంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. అశోకా పిల్లర్ వద్ద ఈ ఘటన జరిగింది. రాంబాబు చేతికి గాయం కాగా, అక్కడే ఉన్న 108 వాహన సిబ్బంది ప్రథమ చికిత్స చేసి, ఆపై ఆయన్ను హాస్పిటల్ కు తరలించారు. భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Vijayawada
Fly Over
Conistable

More Telugu News