KCR: తమిళనాడు ప్రభుత్వానికి, తమిళనాడు ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు

CM KCR thanked Tamilnadu CM and Tamilnadu people for their solidarity gesture
  • వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిన హైదరాబాదు
  • హైదరాబాదుకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్ల సాయం
  • దుప్పట్లు, చాపలు కూడా పంపుతున్న తమిళ సర్కారు
వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న హైదరాబాద్ నగరానికి తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్ల సాయం ప్రకటించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితి పట్ల ఉదారంగా స్పందించి, భారీ ఆర్థికసాయం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వానికి, తమిళనాడు ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

రూ.10 కోట్ల సాయంతో పాటు దుప్పట్లు, చాపలు కూడా పంపిస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారని వివరించింది. అంతేకాకుండా, మున్ముందు ఏదైనా సాయం కావాల్సి వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడు ప్రభుత్వం, అక్కడి ప్రజలు సంఘీభావం ప్రకటించిన తీరు పట్ల ధన్యవాదాలు తెలిపినట్టు సీఎంఓ పేర్కొంది.
KCR
Tamilnadu
Palaniswamy
Hyderabad
Floods
Telangana

More Telugu News