Maharashtra: భోజనానికి పిలిచి కోడిగుడ్డు కూర వండలేదని.. స్నేహితుడిని రాడ్డుతో కొట్టి చంపేశాడు!

man killed his friend for not cooked egg curry
  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
  • కోడిగుడ్డ కూర కోసం స్నేహితుల మధ్య గొడవ
  • తీవ్రంగా గాయపడిన బన్సారీ అక్కడికక్కడే మృతి 
భోజనానికి పిలిచిన స్నేహితుడు కోడిగుడ్డు కూర వండలేదని అతడిని చంపేశాడో కిరాతకుడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మకాపూర్ ప్రాంతానికి చెందిన బన్సారీ (40) శనివారం రాత్రి తన స్నేహితుడు గౌరవ్ గైక్వాడ్‌ను భోజనానికి పిలిచాడు.

 ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు మద్యం తాగారు. అనంతరం భోజనానికి కూర్చోగా కోడిగుడ్డు కూర ఏదని గైక్వాడ్ ప్రశ్నించాడు. వండలేదని బన్సారీ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది ముదరడంతో కోపం పట్టలేని గైక్వాడ్ ఇనుపరాడ్డుతో బన్సారీ తలపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన బన్సారీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Maharashtra
Nagpur
Egg curry
murder

More Telugu News