Rojaramani: సినీ దంపతులు రోజారమణి, చక్రపాణిలకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు

Rojaramani and Chakrapani gets Life Achievement award
  • తెలుగు సినీ రంగంలో ప్రకాశించిన రోజారమణి
  • ఒడిశాలో సినీ హీరోగా చక్రపాణికి గుర్తింపు
  • వర్చువల్ విధానంలో అవార్డు ప్రదానం
  • తమ తల్లిదండ్రులకు పురస్కారం అందించిన హీరో తరుణ్, అమూల్య
తెలుగు సినీ రంగంలో రోజారమణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ దివిలో విరిసిన పారిజాతమో గీతంలో లేలేత పరువాల పడుచుపిల్లలా నాడు ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు పెట్టారు. అనేక మరపురాని చిత్రాల్లో నటించి తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయ తారగా నిలిచిపోయారు. డబ్బింగ్ రంగంలోనూ ప్రవేశించి 400 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పారు. ఇక ఆమె భర్త చక్రపాణి ఒడిశా సినీ రంగంలో అగ్రశ్రేణి హీరోగా వెలుగొందారు. తెలుగులో ఎన్టీ రామారావుకు ఎంత క్రేజ్ ఉంటుందో, ఒడిశాలో చక్రపాణికి అంతే గుర్తింపు ఉంది. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు.

ఈ క్రమంలో వారి ఘనతలకు గుర్తింపుగా వంశీ ఇంటర్నేషనల్, యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ ఆన్ లైన్ విధానంలో రోజారమణి, చక్రపాణి దంపతులకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు బహూకరించారు. ఈ అవార్డును రోజారమణి, చక్రపాణి తమ పిల్లలైన హీరో తరుణ్, అమూల్యల చేతులుమీదుగా తమ నివాసంలోనే అందుకున్నారు. వర్చువల్ విధానంలో సాగిన ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత మురళీమోహన్, దర్శకుడు రేలంగి నరసింహారావు, వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
Rojaramani
Chakrapani
Life Achivement
Tarun
Tollywood
Odisha

More Telugu News