: సాధించాల్సింది ఇంకా ఉంది: ప్రధాని మన్మోహన్
యూపీఏ పాలనలో దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళినా, సాధించాల్సింది ఇంకా ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంటున్నారు. యూపీఏ-2 ప్రభుత్వం నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని తన నివాసంలో నేడు భాగస్వామ్య పక్షాలకు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన సర్కారు ప్రగతి నివేదికను చదివి వినిపించారు. తమ పాలనలో దేశం ఆర్ధికంగా బలపడిందని చెబుతూ, ద్రవ్యోల్బణం నియంత్రణలో తగిన ప్రగతి సాధించామని తెలిపారు. ద్రవ్యలోటును సమర్థంగా నిర్వహించామని చెప్పారు. ఈ ఏడాది వృద్ధి రేటు 6 శాతం కన్నా ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశామని, తద్వారా వెనకబడిన రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధాని వివరించారు. సమీకృత అభివృద్ధిలో భాగంగా అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్ళామని చెప్పారు. తమ పాలనలో ప్రపంచదేశాలతో సంబంధాలు గణనీయంగా మెరుగయ్యాయని తెలిపారు.